Guru Nilayam


Thoughts of Guruji and our organisation

ఈ యొక్క విశ్వమందు సృష్టిలోని ప్రతి ప్రాణి వాటి సంపూర్ణ వికాసంతో జీవితాన్ని కొనసాగిస్తాయి.


మానవ జీవితంలో ఎన్నో మార్పులతో ఎన్నో రకాల సాధన పద్ధతులతో తాను చదివిన విన్న చూసిన జ్ఞానంతో తన మనుగడను కొనసాగిస్తూ మనిషి మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ప్రయత్నంలో పూర్వకాలంలో సంపూర్ణ ఏకాగ్రతతో ఒక విషయానికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానాన్ని ఆ జ్ఞానం ద్వారా పొందిన అనుభూతిని భవిష్యత్తు తరాలకి అందించాలనే తపనతో మన పూర్వీకులు ఎంతో ఉన్నతమైన జ్ఞానాన్ని మనకు అందించారు. అటువంటి జ్ఞానాన్ని విని ఆకలింపు చేసుకొని సాధనా పద్ధతి ద్వారా గమ్యాన్ని చేరుకొని ప్రశాంతమైన జీవితాన్ని పరిపూర్ణ ఆయుష్షుని కొనసాగించడానికి ఒక చక్కటి సాధనా మార్గం నేను ఎంతోమంది ఆశ్రమాలలో ఉండే గురువులతో సాంగత్యం మరియు సత్సంగం చేసి నిఘూడమైనటువంటి ఆధ్యాత్మిక ఆరోగ్య శక్తి సాధన రహస్యాలను తెలుసుకొని నేటి మానవుడు పడుతున్న శారీరక మానసిక ఆధ్యాత్మిక వేదన నుంచి బయటపడేయాలని ఉద్దేశంతో శ్రీ షిరిడి సాయి అష్టాంగ యోగ విద్యా విధానాన్ని రూపొందించుకొని యోగ శిక్షణ మార్గం ద్వారా వారి వికాసానికి పూర్తిగా సేవా దృక్పథంతో 20 సంవత్సరాలుగా జీవితాన్ని ముందుకు తీసుకెళుతున్నాను. కొన్ని వేల మందిలో ఒక మంచి సాధనా పద్ధతిని అందించగలిగాను. ఒక మనిషిగా పుట్టినటువంటి వ్యక్తి తనను తాను సంస్కరించుకొని ప్రపంచాన్ని పరిస్థితులను అవగాహన చేసుకుని ఒకదాని పట్ల పూర్తి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం ద్వారా వికాసానికి మార్గాలు వేయాలి ఆ మార్గాలను నేను మానవాళికి అందించడం జరుగుతున్నది.


అంతేకాకుండా పుట్టిన ప్రతి వ్యక్తి తన జన్మను సార్ధకత చేసుకోవాలి అంటే సంఘంలో సమాజంలో జరుగుతున్నటువంటి లోటుపాట్ల పట్ల స్పందించి వారిని సేవా మార్గం ద్వారా ఆదుకోవడము మరికొంతమందిని సేవా మార్గం వైపుకు మరణించడం వీటి ద్వారా వ్యక్తులలో ధైర్యం ఆత్మవిశ్వాసం నిండుకొని ముందుకు వెళ్లడం జరుగుతుంది అలాగే ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించడం అంటే మనిషి వాస్తవంలోకి ప్రయాణం చేసి ప్రకృతి వనరులను వృధా కానీయకుండా రక్షించడమే దీనిని బాధ్యతగా తీసుకొని వారిలో చైతన్యాన్ని తీసుకురావడం.


మనుషుల మధ్య జాతి మత కుల ప్రాంత బీద ధనిక అనే తారతమ్యాలను తొలగించి విశ్వమంతా ఒకటే కుటుంబము అందరికీ అన్ని జీవులకు సరియైన జీవించే హక్కు కలిగి ఉన్నదని వాటి హక్కును భంగం కలిగించకూడదని మనుషులలో పేరుకుపోయిన ఈ మూఢత్వాన్ని తొలగించి ప్రేమతో కూడినటువంటి సమాజం నిర్మాణంలో మన కార్యక్రమాలు ముందుకు సాగుతూ ఉంటాయి.


మనిషిని ఆరోగ్యం వైపు మరల్చడానికి వారిలో జాలి దయ ప్రేమ కరుణ అనేటువంటి గుణాలను పెంపొందింప చేసి వాటి ద్వారా పర్యావరణాన్ని మరియు సమాజంలో తోటి వ్యక్తులను సమస్త జీవకోటి పట్ల తను హృదయంతో స్పందించి తన జీవితాన్ని సేవగా మార్చుకుంటూ మనిషి ఆరోగ్యానికి అవసరమైనటువంటి సంపూర్ణ శాఖాహారాన్ని మనుషుల జీవన విధానం గా మార్చడమే ఈ మిషన్ లో మరియొక ముఖ్య ప్రధాన అంశము.
పుట్టిన ప్రతి ఒక్కరిని చదువు జ్ఞానం వైపు ఎంత ముందుకు ప్రయాణం కొనసాగింప చేస్తే వారి జీవితాల్లో అంత వెలుగు నిండుకుంటుంది అనేది వాస్తవం ఈ గురు నిలయం ద్వారా కోటానుకోట్ల మందిలో ఆ దివ్యజ్ఞాన జ్యోతిని వెలిగించాలనే సంకల్పంతో పనిచేయుచున్నది.


సహజంగానే మానవుడిలో దాగి ఉన్నటువంటి దివ్య శక్తులను చైతన్యపరిచి క్రమశిక్షణతో కూడినటువంటి ఆధ్యాత్మిక జీవన విధానాన్ని సాధన చేపిస్తూ దానిని తన జీవితంలో అన్వయించుకునేలా అది తెలియకుండానే ఇతరుల జీవితాల్లో వెలుగునిచ్చేదిగా చేసి ఆధ్యాత్మిక పరిణతి ప్రతి ఒక్కరిలో కలిగించడం అనేది మనిషిని విశ్వ చైతన్యంతో మమేకం చేయడం గురువుల వారసత్వం ద్వారా వచ్చినటువంటి శక్తిని ధారపోయడం దానితో వారిలోని చైతన్యాన్ని కదిలించి దివ్యజ్ఞానం వైపుకు మనిషిని పయనింప చేయడం జరుగుతున్నది.


భూమిపైన జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస పద్ధతులతో ఏ ఒక్కరికి చిన్న అసౌకర్యం కలిగించకుండా సత్యవంతమైన జీవన విధానాన్ని ఉద్యోగ వ్యాపార జీవితాలను ముందుకు తీసుకెళ్తూ ఉండే వ్యక్తిగా మార్చడం ఈ వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఒక శాంతితో కూడినటువంటి సత్యానికి ప్రతిరూపంగా మార్పు చేయాలనేదే మా భావన.

  • మనిషి సంపూర్ణంగా కుటుంబ బాంధవ్యాలలో ధర్మపదమైన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు అతడిలో మానసిక దృఢత్వం పెంపొందుతుంది సత్యవంతంగా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు అతనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శాంతితో తను ముందుకు నడుస్తున్నప్పుడు నూతన కార్యక్రమాలు చేపట్టేటువంటి జ్ఞానం సిద్ధిస్తుంది ప్రేమ తత్వాన్ని తనలో నింపుకున్నప్పుడు ఎదుటి వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటు అందించే గుణము ఆ సేవా గుణము ద్వారా మనిషి మనసు ఆనంద తాండవం చేస్తుంది. అహింసా మార్గమును అవలంబించడం ప్రతి ప్రాణిలోనూ పరమేశ్వరుని చూడడం ప్రతి మనిషిని ప్రతి జీవిని గౌరవించడం వలన తను ఒక లీడర్ వంటి లక్షణాలు కలిగి దివ్యజ్ఞాన జ్యోతి స్వరూపంగా తను బ్రతికి ఉండగానే లక్షలమంది హృదయాలలో ఒక గొప్ప వ్యక్తిగా సంపాదించుకుంటారు అటువంటి వ్యక్తులను తయారుచేస్తుంది ఈ గురు నిలయం
  • గ్రామ గ్రామాల్లో యోగ విద్యను నేర్పిస్తూ
  • పాఠశాలలలో బాలల వ్యక్తిత్వ వికాస యోగ శిక్షణను అందిస్తూ.
  • మానవతా నైతిక విలువలను పెంపొందించే సెమినార్లను నిర్వహిస్తూ
  • సేవా కార్యక్రమాలను ఎజెండాగా ముందుకు కొనసాగడం జరుగుతున్నది.

2000 సంవత్సరంలో ఆధ్యాత్మిక సత్సంగంలోకి ప్రవేశించి విద్యార్థిగా ఉన్నప్పుడే బాల సంస్కార్ అనే విత్తనాన్ని శిక్షణ పొంది భక్తి మార్గం ద్వారా పూజ గురుదేవులు అమ్మల సాంబశివరావు గారి ప్రవచనాల సత్సంగం మూడు సంవత్సరాలు కొనసాగిన తర్వాత ఆధ్యాత్మిక సాధన తత్వంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి శిష్యులు కృష్ణ యోగేశ్వర్లు చేత సిద్ధిక్ అనే నామకరణం తో ఆధ్యాత్మిక సాధనలో అడుగులు వేస్తూ దానిని పరిపూర్ణం చేయడానికి యోగ విద్య సరైన మార్గమని గ్రహించి శ్రీ సత్యసాయి ధ్యాన మండలి పూజ శ్రీ భిక్షమయ్య గురూజీ గారి సారధ్యంలో గురువుల గురుకుల శిక్షణ పొంది వారి అడుగుజాడల్లో నడుస్తూ యోగ విద్యను బోధించడం జరిగింది.

ఆ తరుణంలోనే 2008వ సంవత్సరంలో 70 సంవత్సరాల వయసు కలిగిన సాధుసంతు మహారాజ్ శ్రీ సిద్దిరాజ్ తపోతనగిరి స్వామీజీ సారథ్యంలో కఠిన ఆధ్యాత్మిక యోగ విద్యాసాధన చేయడము విశ్వమంతా వసుదైక కుటుంబం అనేటువంటి ఉన్నతమైన జ్ఞానాన్ని పొందడం జరిగినది ఈ మార్గమునందే ప్రపంచంలోని 40 దేశాలలో సూర్య యోగాన్ని పరిచయం చేస్తున్నటువంటి సన్యోగి ఉమా శంకర్ గారి వద్ద సూర్య యోగాన్ని నేర్చుకొని సాధన చేస్తూ ముందుకు వెళ్లడం తమిళనాడులో ఉన్నటువంటి వేదాద్రి మహర్షి గారి యోగ సాధన పద్ధతిని నేర్చుకొని అనుభవ సారాన్ని కలుపుకొని సాధన చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో గుడివాడ వద్ద ఉన్నటువంటి పునాదిపాడు మాతాజీ ద్వారా ఉపదేశం తీసుకొని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా ఆశీస్సులతో ఆరు నెలలు నా జీవితము యోగ విద్యలో ఉంటే మరియొక ఆరు నెలల్లో సాధనా మార్గంలో జీవితాన్ని కొనసాగిస్తూ ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న బంధాన్ని క్రియాయోగ సాధన ద్వారా తెలుసుకొని నా యొక్క ఇన్నర్ జర్నీలో నేను మహోన్నతమైనటువంటి ఆత్మానందాన్ని పొందుతున్నాను.

ఆ ఆత్మానందాన్నే ఇతరులకు అందజేయడం జరుగుతున్నది. పంచభూత తత్వాలను గురించి సంపూర్ణంగా తెలుసుకొని దేహమందు దాగి ఉన్న పంచభూత తత్వాలతో బయట ఉన్న తత్వాలను జోడించి జల యోగము సూర్య యోగము క్రియాయోగ రహస్యములు తెలుసుకొని ప్రకృతి నాకు గురువై బోధించిన ఆధ్యాత్మిక విద్యతో నా సాధనను సునాయాసంగా ముందుకు తీసుకెళ్తున్నాను.
ప్రాణిక్ హీలింగ్ రేకి ముద్రాతెరపి ప్రాణ వైలెట్ హీలింగ్ ఇలాంటి సాధనా పద్ధతులు నేర్చుకుని నేను ఆరోగ్యాన్ని పొందుతూ ఇతరులకు ఆరోగ్యాన్ని పంచుతూ సేవ చేయడం జరుగుతున్నది.

యోగ రత్న నవరత్న యోగసేవారత్న స్వధర్మయోగి జాతీయ అంతర్జాతీయ అవార్డులను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆంధ్ర సార్స్వతా పరిషత్ త్యాగరాయ గాన సభ గాంధీ గ్లోబల్ ట్రస్ట్ రవీంద్ర భారతి వేదికల పైన అందుకోవడం జరిగినది.
ప్రముఖ కళావేదిక రవీంద్రభారతి ఒక కళాకారుడిగా గుర్తించి గుర్తింపు కార్డును పొందడం జరిగింది.

శ్రీ షిరిడి సాయి అష్టాంగ యోగ శిక్షణ


పది రోజుల 12 రోజుల 15 రోజుల 21 రోజుల యోగ శిక్షణా తరగతులను అందజేయడం
ఈ శిక్షణలో వ్యాయామాలు ప్రాణాయామాలు సూర్య నమస్కారాలు ఆసనాలు ధ్యానం ముద్రలు క్రియలు నేర్పించడం జరుగును.


క్రియాయోగంలో భాగంగా మనిషిని పంచభూతాలతో అనుబంధాన్ని పెంచడం నేచర్ క్యూర్ విధానంలో భాగంగా స్ట్రీమ్ బాత్ లీ బాత్ సన్ బాత్ వంటివి ఇస్తూ ఆరోగ్యవంతులుగా తయారు చేయడం
క్రియాయోగంలో మనిషి ప్రకృతికి అనుసంధానమై ప్రకృతి శక్తిని పొందే ఆధ్యాత్మిక యోగ సాధన నేర్పించడం జరుగుతుంది.


ఆ పరమేశ్వర శక్తిని అనుభవ పూర్వకంగా తెలుసుకునే క్రియాయోగంలోని మూడవ భాగాన్ని నేర్చుకోవడం దాని ద్వారా కుటుంబ వ్యక్తిగత వృత్తి వ్యాపార జీవన విధానాల్లో మార్పు తెచ్చుకోవడం జరుగుతున్నది.
క్రియాయోగంలోని ఉన్నత స్థితి శ్రీ షిరిడి సాయి నాధుడు బోధించినటువంటి ఆధ్యాత్మిక సాధనా పద్ధతిని ధ్యానయోగంలో వారి ద్వారా నేర్చుకొని ఇతరులకు నేర్పించడం జరుగుతున్నది. ఇది షిరిడికి 18 కిలోమీటర్ల దూరంలో కోపర్గాం గ్రామం నందు షిరిడి సాయి సాధన చేసినటువంటి ప్రదేశంలో బాబా వారు సూక్ష్మ రూపంలో నేర్పించిన సాధన పద్ధతి నేర్పించడం జరుగుతున్నది.
సెల్ఫ్ ఫీలింగ్ టెక్నిక్ అయినటువంటి పైడాలాజిన్ అనే విద్య ద్వారా వ్యక్తి తన సొంతంగా తన ఆరోగ్యాన్ని తాను బాగు చేసుకునే విధానాన్ని నేర్పించడం.
సెల్ఫ్ నేచర్ హీలింగ్ అనే సాధన పద్ధతి ద్వారా విశ్వప్రాణి శక్తిని తీసుకుంటూ తనని తాను బాగు చేసుకుంటూ ఇతరులను కూడా బాగుపరిచే ఉన్నతమైనటువంటి పద్ధతిని నేర్పించడం జరుగుతున్నది.

ఈ యోగా శిక్షణను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో అందిస్తున్నారు. ఎంట్రీల కోసం, దయచేసి సెల్ – +91 9603256572 లేదా మా వెబ్‌సైట్- gurunilayam.org ద్వారా మమ్మల్ని సంప్రదించండి.

—-ఇట్లు,
ఇస్మాయిల్ గురూజీ